Mithun Reddy: నీకు తలమీద వెంట్రుకలే లేవనుకున్నా, తలలో మెదడు కూడా లేనట్టుంది: గల్లా జయదేవ్ పై మిథున్ రెడ్డి విమర్శలు

  • గల్లా, మిథున్ మధ్య ట్విట్టర్ వార్
  • ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ నేపథ్యంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం
  • అవివేకం అంటూ గల్లా ట్వీట్.. ఘాటుగా స్పందించిన మిథున్
సోషల్ మీడియాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థను డమ్మీ కంపెనీగా అభివర్ణించడం అవివేకమని గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు. దీనిపై మిథున్ రెడ్డి ట్విట్టర్ లో బదులిచ్చారు.

"నీకు తలమీద వెంట్రుకలే లేవనుకున్నా, ఇప్పుడర్థమవుతోంది నీకు తలలో మెదడు కూడా లేదని. పెట్టుబడిదారులను ఏపీ రాకుండా చేయాలని ఎందుకంత హడావుడి చేస్తున్నావు? అజ్ఞాని, అవివేకి అని ఎవర్నంటున్నావు? అది నువ్వే" అంటూ మిథున్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

"కియా మోటార్స్ వాళ్లు మేం ఏపీ దాటి వెళ్లట్లేదు మొర్రో అంటుంటే నువ్వు పనిగట్టుకుని ఫేక్ న్యూస్ ఎందుకు ప్రచారం చేస్తున్నావు? ఓ ఎంపీ ఎంత బాధ్యతగా వ్యవహరించాలో నీకు తెలియదా? లేక నీ నుంచి అంత బాధ్యతను ఆశించడం సరికాదంటావా?" అని ప్రశ్నించారు.
Mithun Reddy
YSRCP
Galla Jayadev
Telugudesam
Andhra Pradesh
Lok Sabha

More Telugu News