MLA: చంద్రబాబు కుట్రలతో రాజకీయాలు చేస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు

  • అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది
  • కియా మోటార్ తరలిపోతోందంటూ అసత్య ప్రచారం చేశారు  
  • రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసు
అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. చంద్రబాబు తన హయాంలో అసెంబ్లీలో రాజధానిగా అమరావతి పేరును ప్రకటన చేయక ముందే లీకులిచ్చారని ఆయన ఆరోపించారు. తనకు కావాల్సిన వారికి లీకులిచ్చారని పేర్కొన్నారు. గతంలో టీడీపీలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ లను బీజేపీలోకి ప్రత్యేక ప్రయోజనాలనుద్దేశించి పంపారన్నారు. చంద్రబాబు కుట్రలతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు.

 సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాలను విమర్శించడం తగదన్నారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బినామీలకు బాధ కలిగితే.. దానిని రాష్ట్రంపై రుద్దుతున్నారని మండిపడ్డారు. రైతులను, కార్మికులను రెచ్చగొడుతున్నారని చెప్పారు. వైఎస్సార్ కుటుంబం బ్రతకనిస్తుంది.. కానీ  టీడీపీ నేతల్లాగా ప్రవర్తించదని ఆయన అన్నారు. కియా మోటార్స్ పరిశ్రమ రాష్ట్రం నుంచి తరలిపోతోందని కావాలని ప్రచారం చేశారని దుయ్యబట్టారు. తన అనుయాయులపై ఐటీ దాడులు జరుగుతున్న విషయాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే చంద్రబాబు కియా మోటార్స్ విషయాన్ని ఎత్తుకున్నారని ఎమ్మెల్యే విమర్శించారు.
MLA
Sudhkar Babu
YSRCP
Critcism
Chandrababu
Andhra Pradesh

More Telugu News