Kangana Ranaut: ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసి కూడా కంగన బరువు పెరిగింది: రంగోలి

  • తన పాత్రకు న్యాయం చేయడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటుంది
  • 'తలైవి' కోసం రోజుల వ్యవధిలోనే 10 కేజీల బరువు పెరిగింది
  • 'తను వెడ్స్ మను' సమయంలో ఆమె కాలుకి 52 కుట్లు పడ్డాయి
వృత్తి పట్ల కంగనా రనౌత్ కు నిబద్ధత చాలా ఎక్కువని... తన పాత్రకు న్యాయం చేయడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటుందని ఆమె సోదరి రంగోలి తెలిపింది. జయలలిత బయోపిక్ 'తలైవి' కోసం రోజుల వ్యవధిలోనే ఆమె 10 కేజీల బరువు పెరిగిందని, ఆమె శరీరంలో కొవ్వు శాతం బాగా పెరిగిందని చెప్పింది. తన ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసి కూడా బరువు పెరిగిందని తెలిపింది.

'తను వెడ్స్ మను' సినిమా షూటింగ్ సమయంలో కంగన బైక్ యాక్సిడెంట్ కు గురైందని, అప్పుడు ఆమె కాలుకి 52 కుట్లు పడ్డాయని రంగోలి చెప్పింది. 'మణికర్ణిక' షూటింగ్ సమయంలో కూడా తన సహనటుడు పొరపాటున మెటల్ రాడ్ తో కంగన తలపై కొట్టాడని, అప్పుడు నుదుటికి 15 కుట్లు పడ్డాయని వెల్లడించింది.  
Kangana Ranaut
Rangoli
Thalaivi Movie
Bollywood

More Telugu News