Rahul Gandhi: నేను మాట్లాడడం బీజేపీ నేతలకు కచ్చితంగా ఇష్టం ఉండదు: రాహుల్

  • మోదీని కాపాడేందుకు బీజేపీ సభ్యులు రగడ సృష్టించారన్న రాహుల్
  • తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని ఆరోపణ
  • కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఎవరిపైనా దాడి చేయలేదని వివరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విపక్షాల నుంచి కాపాడేందుకే లోక్ సభలో బీజేపీ సభ్యులు కావాలనే రభస చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. వాయనాడ్ లో వైద్య కళాశాల లేకపోవడంతో, దాని ప్రాధాన్యతను వివరించేందుకు ప్రయత్నించానని, బీజేపీ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.

 తాను మాట్లాడడం బీజేపీ నేతలకు ఎంతమాత్రం ఇష్టంలేదని ఈ ఘటనతో వెల్లడైందని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఎవరిపైనా దాడి చేయలేదని, ఆయనపైనే దాడి జరిగిందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అందుకు ఆధారంగా ఫుటేజ్ కూడా ఉందని వెల్లడించారు.
Rahul Gandhi
BJP
Lok Sabha
Congress
Narendra Modi

More Telugu News