KTR: తెలంగాణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులపై కేటీఆర్ ప్రశంసల జల్లు

షార్ట్స్‌లో చూడండి
ఇటీవలే మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో తెలంగాణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పేరుకు తగ్గట్టే సత్వర న్యాయం అందేలా చేశాయని మంత్రి కేటీఆర్ అభినందించారు. కేవలం 6 నెలల వ్యవధిలో తెలంగాణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 3 తీవ్రమైన నేరాల్లో తీర్పులు వెలువరించాయని తెలిపారు. ఈ కేసుల్లో ఐదుగురు నిందితులకూ ఉరిశిక్ష పడిందని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థకు, హోం డిపార్ట్ మెంట్ అధికారులకు శుభాభినందనలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు తీవ్రంగా శ్రమించారని కొనియాడారు.
Go Back to Shorts
KTR
FastTrackCourt
Telangana
TRS
Social Media

More Telugu News