KIA Motors: స్థానిక ఉద్యోగ నిబంధన లేదు... మా వద్దకు రండి: కియాకు స్వాగతం పలికిన పంజాబ్!

  • ఏపీ నుంచి కియా వెళ్లిపోతుందని వార్తలు
  • మా వద్దకు వస్తే ప్రోత్సాహకాలు ఇస్తాం
  • ట్విట్టర్ లో వెల్లడించిన ఇన్వెస్ట్ పంజాబ్
ఆంధ్రప్రదేశ్ నుంచి కియా మోటార్స్ తరలి వెళుతుందంటూ వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపుతుంటే, పలు రాష్ట్రాలు ఆ సంస్థకు ఆహ్వానం పలుకుతున్నాయి. కియా ప్రతినిధులు తమిళనాడు రాష్ట్రంతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుండగా, తాజాగా, పంజాబ్ రాష్ట్రం కియాకు స్వాగతం పలికింది. తమ రాష్ట్రంలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధనలు లేవని స్పష్టం చేసింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పలురకాల ప్రోత్సాహకాలను అందుకోవచ్చని పేర్కొంది. తమ రాష్ట్రంలో పారిశ్రామిక సంస్కరణలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ మేరకు 'ఇన్వెస్ట్ పంజాబ్' తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టింది.
KIA Motors
Punjab
Local Hiring
Andhra Pradesh

More Telugu News