ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఐడీకి పిఠాపురం విగ్రహాల ధ్వంసం కేసు అప్పగింత!
- ఆరు ఆలయాల్లోని 12 విగ్రహాల కూల్చివేత
- హిందూ సంఘాల ఆగ్రహం
- నిష్పక్షపాత దర్యాప్తునకు కేసు సీఐడీకి అప్పగింత
విగ్రహాల ధ్వంసంపై సర్వత్ర నిరసనలు వెల్లువెత్తాయి. హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు, క్లూస్ టీం బృందాలు ఆధారాలు సేకరించాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ సీఐడీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.