Kodi Ramakrishna: కోడి రామకృష్ణ చిన్నకుమార్తె వివాహ వేడుకలో టాలీవుడ్ సందడి

  • మహేశ్ తో కోడి రామకృష్ణ కుమార్తె ప్రవల్లిక వివాహం  
  • వేదికగా నిలిచిన గండిపేట కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్స్
  • హాజరైన చిరంజీవి, మోహన్ బాబు, బాలయ్య
దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ చిన్నకుమార్తె ప్రవల్లిక వివాహం మహేశ్ తో ఘనంగా జరిగింది. హైదరాబాదులోని గండిపేటలో ఉన్న కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ ఈ పెళ్లికి వేదికగా నిలిచింది. బుధవారం రాత్రి జరిగిన ఈ పెళ్లికి చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, కె.రాఘవేంద్రరావు, జయప్రద, మురళీమోహన్, జీవిత, గోపీచంద్, కోదండరామిరెడ్డి, అల్లు అరవింద్, దిల్ రాజు, నాగబాబు అర్ధాంగి పద్మజ, ఆయన కుమార్తె నిహారిక తదితరులు విచ్చేశారు. అటు రాజకీయ నాయకులు కూడా ఈ పెళ్లిలో సందడి చేశారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పెళ్లి వేడుకలో కనిపించారు. కాగా, బాలయ్య సతీసమేతంగా రాగా, జీవిత తన కుమార్తె శివానీతో కలిసి విచ్చేశారు.
Kodi Ramakrishna
Daughter
Wedding
Pravallika
Mahesh
Tollywood
Chiranjeevi
Balakrishna
Mohanbabu

More Telugu News