Shivaji: చిరంజీవి తరువాత అల్లు అర్జున్ అంటే ఇష్టం: నటుడు శివాజీ

  • 90 సినిమాలకి పైగా చేశాను 
  • 'మిస్సమ్మ' చెప్పుకోదగిన చిత్రం 
  • సాయిపల్లవి అంటే అభిమానమన్న శివాజీ 
బుల్లితెరపై యాంకర్ గా దూసుకొచ్చిన శివాజీ, ఆ తరువాత సినిమాల్లో చిన్నచిన్న పాత్రలను చేస్తూ హీరో అయ్యాడు. ఆయన కెరియర్లో హీరోగా కొన్ని హిట్లు ఉన్నప్పటికీ, 'మిస్సమ్మ' చెప్పుకోదగినదిగా నిలిచింది. ప్రస్తుతం రాజకీయాలలో చురుకైన పాత్రను పోషిస్తున్న ఆయన, తాజా ఇంటర్వ్యూలో సినిమాలను గురించి ప్రస్తావించారు.

"ఇంతవరకూ 94 .. 95 సినిమాలు చేశాను. నేను అభిమానించే హీరో చిరంజీవి .. ఇప్పటి యువ కథానాయకులలో అల్లు అర్జున్ అంటే ఇష్టం. రజనీకాంత్ తరువాత సౌత్ ఇండియా సూపర్ స్టార్ అల్లు అర్జునే అనేది నా అభిప్రాయం. నా నాలుకకి పవర్ వుంది .. నేను అన్నది జరుగుతుంది. కథానాయికల విషయానికొస్తే అలనాటి కథానాయికలలో సావిత్రిగారంటే ఇష్టం. ఆ తరువాత సౌందర్య అంటే ఇష్టం. ఈ తరం నాయికలలో సాయిపల్లవిని ఎక్కువగా అభిమానిస్తాను" అని చెప్పుకొచ్చారు.
Shivaji
Chiranjeevi
Missamma Movie

More Telugu News