Narendra Modi: నెహ్రూ మతవాదా? హిందూ దేశాన్ని కోరుకున్నారా? సమాధానం చెప్పండి: కాంగ్రెస్ పై మోదీ ధ్వజం

  • సిక్కు అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని సీఎం చేశారు
  • పాక్ లోని మైనార్టీలను రక్షించాలని నెహ్రూ కూడా కోరుకున్నారు
  • జమ్ముకశ్మీర్ లో దశాబ్దాల పాటు రాజ్యాంగాన్ని అమలు చేయలేదు
లోక్ సభలో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు చేసిన వారిని మీరు జైలుకు పంపలేదని... పైగా ఆ అల్లర్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని కూడా చేశారని మండిపడ్డారు.

పాకిస్థాన్ లోని మైనార్టీలను రక్షించాలని దివంగత ప్రధాని నెహ్రూ కూడా కోరుకున్నారని మోదీ చెప్పారు. కాంగ్రెస్ ను తాను ఒక విషయం అడగాలనుకుంటున్నానని... నెహ్రూ మతవాదా? హిందూ దేశాన్ని కోరుకున్నారా? చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి ప్రధాని కావాలనుకున్నారని... అందుకే భారత్ మధ్య గీత గీశారని, దాంతో దేశం విడిపోయిందని అన్నారు.

రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నవారు జమ్ముకశ్మీర్ లో దశాబ్దాల పాటు దాన్ని అమలు చేయలేదని... జమ్ముకశ్మీర్ అల్లుడు, కాంగ్రెస్ నేత శశి థరూర్ అయినా ఈ విషయంలో కొంచెమైనా ఆవేదన వ్యక్తం చేయాలని ఎద్దేవా చేశారు.
Narendra Modi
BJP
Lok Sabha
Congress
Jawaharlal Nehru

More Telugu News