Nara Lokesh: దున్నపోతు ప్రభుత్వంపై ‘మీ సేవ’ న్యాయ పోరాటం ఫలించింది: టీడీపీ నేత నారా లోకేశ్

  • ఎన్ని కుట్రలు చేసినా ఆఖరికి న్యాయమే గెలిచింది
  • కోర్టులు చీవాట్లు పెట్టే పరిస్థితి జగన్ తెచ్చుకున్నారు
  • ‘మీ సేవ’ ఆపరేటర్ల పోరాటానికి అండగా ఉంటాం
ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ఘాటు విమర్శలు చేశారు. తుగ్లక్ నిర్ణయాలతో ‘మీ సేవ’ వ్యవస్థపై ఆధారపడ్డ 30 వేల కుటుంబాలను జగన్ రోడ్డున పడేశారని విమర్శించారు. నాలుగు లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకుని 10 లక్షల మంది ఉద్యోగాలు తీసేస్తున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ఆఖరికి న్యాయమే గెలిచిందని అన్నారు.

‘మీ సేవ’ వ్యవస్థని ఉన్నపళంగా తొలగించడం సమంజసం కాదని, ఈ వ్యవస్థపై ఆధారపడ్డ వారి జీవితాలతో ఆటలు వద్దు అని కోర్టులు చీవాట్లు పెట్టే పరిస్థితి జగన్ తెచ్చుకున్నారని విమర్శించారు. ‘మీ సేవ’ ఆపరేటర్లకు అభినందనలు తెలియజేస్తున్నానని, దున్నపోతు ప్రభుత్వంపై వారి న్యాయ పోరాటం ఫలించిందని ప్రశంసించారు. ‘మీ సేవ’ ఆపరేటర్ల పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
cm

More Telugu News