Nara Lokesh: రాష్ట్ర భవిష్యత్తుపై చావు దెబ్బ కొట్టినట్లే: 'కియా తరలింపు' వార్తలపై నారా లోకేశ్

  • ఏపీ ప్రజలు ఏం తప్పు చేశారు?
  • వారికి ఇటువంటి అనుభవాలు ఎందుకు ఎదురవుతున్నాయి? 
  • ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి? 
  • రాష్ట్రం నుంచి కియా తరలిపోతోంది
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ప్లాంటును తమిళనాడుకు తరలించే యోచనలో ఆ సంస్థ ఉందని రాయిటర్స్ సంచలన కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు స్పందిస్తూ ఏపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

'ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం తప్పు చేశారని వారికి ఇటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి? రాష్ట్రం నుంచి కియా తరలిపోతోందంటే రాష్ట్ర భవిష్యత్తుపై చావు దెబ్బ కొట్టినట్లే' అని లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కియా సంస్థ ఫొటోను ఆయన పోస్ట్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh
KIA Motors

More Telugu News