నిర్మల గారిని తొలగించి, తప్పంతా ఆమె నెత్తిన పడేయండి: ప్రధానికి రాహుల్ గాంధీ వ్యంగ్య సలహా
- దేశ ఆర్థిక పరిస్థితి కుదేలైందన్న రాహుల్
- బుర్రకు పదును పెట్టాలని ప్రధానికి సూచన
- నిర్మలా సీతారామన్ ను బాధ్యురాల్ని చేస్తే సరి అంటూ వ్యంగ్యం
"ఇంకెందుకాలస్యం! ఎవరికీ అంతుచిక్కని నిర్మలా గారు అందించిన పనికిమాలిన బడ్జెట్ ఉంది కదా! దేశ ఆర్థిక పరిస్థితికి ఆ చెత్త బడ్జెట్ ను కారణంగా చూపండి. నిర్మల గారిపై వేటు వేసి, తప్పంతా ఆమె నెత్తిన పడేయండి... సమస్య పరిష్కారమవుతుంది" అంటూ విమర్శించారు.