Rahul Gandhi: నిర్మల గారిని తొలగించి, తప్పంతా ఆమె నెత్తిన పడేయండి: ప్రధానికి రాహుల్ గాంధీ వ్యంగ్య సలహా

  • దేశ ఆర్థిక పరిస్థితి కుదేలైందన్న రాహుల్
  • బుర్రకు పదును పెట్టాలని ప్రధానికి సూచన
  • నిర్మలా సీతారామన్ ను బాధ్యురాల్ని చేస్తే సరి అంటూ వ్యంగ్యం
దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై ధ్వజమెత్తారు. గుడ్డు లోపల కోడిపిల్ల లోపలే చచ్చిపోయినట్టుగా దేశ ఆర్థిక పరిస్థితి తయారైందన్న రాహుల్, దీనికి ఎవర్ని బాధ్యుల్ని చేయాలో ఆలోచించేందుకు ప్రధాని బుర్రకు పదునుపెట్టాలని వ్యంగ్యం ప్రదర్శించారు.

"ఇంకెందుకాలస్యం! ఎవరికీ అంతుచిక్కని నిర్మలా గారు అందించిన పనికిమాలిన బడ్జెట్ ఉంది కదా! దేశ ఆర్థిక పరిస్థితికి ఆ చెత్త బడ్జెట్ ను కారణంగా చూపండి. నిర్మల గారిపై వేటు వేసి, తప్పంతా ఆమె నెత్తిన పడేయండి... సమస్య పరిష్కారమవుతుంది" అంటూ విమర్శించారు.
Rahul Gandhi
Nirmala Sitharaman
Narendra Modi
Union Budget 2020

More Telugu News