budda venkanna: మీ ప్రతాపం ట్విట్టర్‌లో కాదు.. మద్యం దుకాణం ముందు చూపండి: విజయసాయికి బుద్ధా వెంకన్న కౌంటర్

  • విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న కౌంటర్
  • మద్యపాన నిషేధం పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారు
  • జగన్ గారిది బిజినెస్ మైండ్ కాదు క్రిమినల్ మైండ్ 
  • మీ లాజిక్ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో చెప్పాలి
'మద్యం ధరలు పెంచినా ఆదాయం ఎందుకు పెరగడం లేదని చంద్రబాబు గోల పెడుతున్నాడు. బిజినెస్ మైండ్ కదా?' అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

'విజయసాయిరెడ్డి గారు మీ ప్రతాపం ట్విట్టర్ లో కాదు.. మద్యం దుకాణం ముందు నిలబడి చూపించండి. మద్యపాన నిషేధం పేరుతో కోట్లు కొల్లగొడుతున్న జగన్ గారిది బిజినెస్ మైండ్ కాదు క్రిమినల్ మైండ్' అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

'ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో బ్రాండ్ల దందా మొదలు పెట్టిన మీరు మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నారా? సిగ్గుగా లేదా? మద్యపాన నిషేధం అమలై అందరూ తాగడం మానేశారు అని డప్పు కొడుతున్నారు. మరి మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎలా పెరుగుతుంది సాయిరెడ్డి గారు?' అని ప్రశ్నించారు.

'తప్పుడు లెక్కలు రాసే మీరే ఈ లాజిక్ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో చెప్పాలి. జగన్ గారికి, మీకు డబ్బు పిచ్చి పోగొట్టేలా మనీ డీ-అడిక్షన్ సెంటర్లు పెట్టించుకోండి కాస్త ఉపయోగం ఉంటుంది' అని బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.
budda venkanna
Telugudesam
Vijay Sai Reddy
Twitter

More Telugu News