Corona Virus: విజయసాయి ట్వీట్ కి బుచ్చయ్యచౌదరి వ్యంగ్య జవాబు

  • విజయసాయిరెడ్డి ట్వీట్‌కు కౌంటర్‌
  • చంద్రబాబు అధికారంలో ఉంటే ప్రయత్నమైనా చేసేవారు
  • మీ ముఖ్యమంత్రికి ఆ అలవాటు లేదు కదా అని ఎద్దేవా
అధికారంలోకి వచ్చిన తర్వాత  దేన్నయినా రద్దుతో సరిపెట్టడం మీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే చెల్లిందని టీడీపీ సీనియర్‌ నేత బుచ్చయ్యచౌదరి ఎంపీ విజయసాయిరెడ్డికి చురకంటించారు. తుపాన్లను నిరోధించగల అతీంద్రయ శక్తులు ఉన్న టీడీపీ అధినేత చందద్రబాబు నాయుడు కరోనా వైరస్‌ నియంత్రణకు తక్షణం ఏదో ఒకటి చేస్తారని ప్రపంచం ఎదురు చూస్తోందని, ఆయన మందు కనుక్కోకుంటే ఈ భూమ్మీద మనుషులు మిగలరని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే కరోనా లాంటి వైరస్‌కి మందుకనుక్కొనే ప్రయత్నమైనా చేసేవారని, మీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మందుతో పనిలేదు కాబట్టి ఏకంగా రద్దు చేసేస్తారని సెటైర్ వేశారు. 
Corona Virus
Chandrababu
Vijay Sai Reddy
buchayya choudary
Twitter

More Telugu News