Jagan: రాజధానిపై ప్రజలను మభ్యపెట్టాలని నేను అనుకోవట్లేదు: ఏపీ సీఎం జగన్

  • 'బాహుబలి' లాంటి గ్రాఫిక్స్ చూపను
  • సింగపూర్‌ వంటి నగరాన్ని సృష్టించేంత నిధులు మా దగ్గర లేవు
  • ఏం చేయగలనో ఆ వాస్తవాలను మాత్రమే చెబుతున్నాను 
  • అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది 
ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి 'బాహుబలి' లాంటి గ్రాఫిక్స్ చూపాలని తాను అనుకోవట్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. 'ప్రజలను మభ్యపెట్టాలని, గ్రాఫిక్స్‌ చూపించాలని నేను అనుకోవట్లేదు. జపాన్, సింగపూర్‌ నగరాలను సృష్టించేంత నిధులు మా దగ్గర లేవని నాకు తెలుసు' అని వ్యాఖ్యానించారు.

'నేను ఏం చేయగలనో ఆ వాస్తవాలను మాత్రమే చెబుతున్నాను. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు అందించేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాం. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది' అని వ్యాఖ్యానించారు.

'ఒక  తండ్రిలా నిర్ణయం తీసుకున్నాను కాబట్టే అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రతిపాదనలు చేశాం. ఒక ముఖ్యమంత్రిగా రాబోయే తరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు రాబోయే తరాల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. ఓ మంచి నిర్ణయం తీసుకోకపోతే రాబోయే తరాల  వారి పరిస్థితులను దుర్భరం చేస్తాయి' అని జగన్ తెలిపారు.
Jagan
YSRCP
Amaravati
Andhra Pradesh

More Telugu News