Jagan: పేద పిల్లలు మాత్రమే ఎందుకు తెలుగు మీడియంలో చదవాలి?: సీఎం జగన్‌

  • మొత్తం విద్యావ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తున్నాం
  • ప్రైవేటు బడుల్లో తెలుగు మీడియం ఎందుకు బోధించట్లేదు?
  • ఇంటర్‌నెట్, కంప్యూటర్‌ భాషలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉన్నాయి
తాము కేవలం ఇంగ్లిష్ మీడియాన్ని మాత్రమే తీసుకురావడం లేదని, మొత్తం విద్యావ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విజయవాడ గేట్‌వే హోటల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... 'ప్రైవేటు బడుల్లో తెలుగు మీడియం ఎందుకు బోధించట్లేదు? ఇంగ్లిషు మీడియం అనేది ఇప్పుడు కనీస అవసరం. ఇంటర్‌నెట్, కంప్యూటర్‌ భాషలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉన్నాయి' అని వ్యాఖ్యానించారు.

'ఈ రోజు మనం ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభిస్తే రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తయారవుతారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రిలాంటి వాడు. ఒక తండ్రిగా మీరు, నేను మన పిల్లల్ని తెలుగు మీడియం బడికి పంపగలమా? పేద పిల్లలు మాత్రమే ఎందుకు తెలుగు మీడియంలో చదవాలి? వారిని బలవంతంగా ఎందుకు తెలుగు మీడియం చెప్పే పాఠశాలలకు పంపాలి? ఇంగ్లిష్‌ మీడియంతో చదివితే పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలదొక్కుకుంటారు' అని జగన్ చెప్పారు.
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News