Indian Army: మహిళా కమాండర్లను జవాన్లు ఒప్పుకోవడం లేదు: సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

  • కమాండర్ల స్థాయిలో ఉన్నవారు ఫ్రంట్ లైన్లో పని చేయాలి
  • వారు శత్రువులకు పట్టుబడితే పరిస్థితి ఏమిటి?
  • వారి కుటుంబీకులు కూడా ఈ విషయంలో ఆందోళనగా ఉన్నారు
భారత జవాన్లు తమ పై అధికారులుగా మహిళలను ఒప్పుకోవడం లేదు. ఇది నిజం. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు స్వయంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆర్మీలో కమాండ్ పోస్టులకు మహిళలు సరిపోరని వెల్లడించింది. మహిళలను తమ పై అధికారులుగా అంగీకరించేందుకు జవాన్లు ఇంకా సిద్ధంగా లేరని తెలిపింది.

మహిళా అధికారుల కుటుంబసభ్యులు కూడా వీరి విషయంలో ఆందోళనగా ఉన్నారని... కమాండర్ల స్థాయిలో ఉన్నవారు బోర్డర్ లో ఫ్రంట్ లైన్ లో ఉండాల్సి ఉంటుందని... ఒకవేళ శత్రువులకు వారు పట్టుబడితే, యుద్ధ ఖైదీలుగా వారిని శత్రు దేశాలు తీసుకెళితే, పరిస్థితి ఏంటనేది కుటుంబసభ్యుల ఆందోళన అని చెప్పింది. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణం ఉండే స్థానాల్లో మహిళలను కమాండర్లుగా నియమించకపోవడమే బెటర్ అని తెలిపింది.
Indian Army
Male Troops
Women Officers

More Telugu News