నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు స్టేపై నేడు ఢిల్లీ హైకోర్టు తీర్పు.. సర్వత్ర ఉత్కంఠ!
- పెండింగులో దోషుల క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్లు
- తేలే వరకు ఉరి వద్దన్న పాటియాలా హౌస్ కోర్టు
- హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం, ఢిల్లీ సర్కారు
కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై శని, ఆదివారాల్లో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 2న తీర్పును రిజర్వు చేసింది. నేడు తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తం మరోమారు కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దోషుల ఉరిశిక్ష అమలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఎటువంటి తీర్పు వస్తుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.