Bengaluru: భార్యపై కోపం.. పసిబాలుడికి మద్యం తాగించి భార్యకు వీడియో!

  • ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి
  • పెళ్లయ్యాక తాను ప్రేమించినది ఎవరినో తెలుసుకున్న యువతి
  • ఇద్దరి మధ్య మొదలైన గొడవలు
ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త కుమారేశ్ రౌడీ షీటర్ అని తెలియడంతో ఆమె విస్తుపోయింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈలోపు వారికో బాబు పుట్టాడు. గొడవలు మరింత ముదరడంతో అతడు భార్యపై కోపం పెంచుకున్నాడు. ఇటీవల తన కొడుకుతో కలిసి బయటకు వెళ్లిన అతడు స్నేహితులతో కలిసి మద్యం తాగాడు.

తర్వాత తన పక్కన కూర్చున్న పసిబాలుడితో కూడా మద్యం తాగించాడు. అంతేకాదు, బాలుడు మద్యం తాగుతుండగా వీడియో తీసి భార్యకు షేర్ చేశాడు. ఆ వీడియో చూసిన ఆమె షాకైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బెంగళూరులోని మాగడిరోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.  
Bengaluru
Rowdy sheeter
Crime News

More Telugu News