Hyderabad: హైదరాబాద్‌వాసులకు మరో శుభవార్త.. అందుబాటులోకి ఎంజీబీఎస్-జేబీఎస్ మెట్రో మార్గం!

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నగరవాసులకు ఇది శుభవార్తే. ఈ నెల 7వ తేదీ నుంచి మరో మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. మెట్రోరైలు మొదటి దశలో చివరిదైన ఈ మార్గాన్ని ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభిస్తారు. అనంతరం అదే రైలులో మంత్రులు, అధికారులతో కలిసి సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ వరకు ప్రయాణిస్తారు. మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

11 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో మొత్తం తొమ్మిది స్టేషన్లు ఉన్నాయి. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌కు మెట్రో రైలులో కేవలం 18 నిమిషాల్లో చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. అదే బస్సులో వెళ్లాలంటే మాత్రం దాదాపు గంట సమయం పడుతుందని పేర్కొన్నారు. జేబీఎస్-ఎంజీబీఎస్ ప్రారంభమైతే నగరంలో మొత్తం 69 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా ఢిల్లీ తర్వాత అతిపెద్ద మెట్రో మార్గం కలిగిన నగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు లభిస్తుంది.
Go Back to Shorts
Hyderabad
Metro rail
JBS
MGBS
KCR
KTR

More Telugu News