టీమిండియా అండర్-19 జట్టుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు

షార్ట్స్‌లో చూడండి
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ లో భారత జట్టు ఫైనల్లోకి చేరడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘సెమీ ఫైనల్లో పాకిస్థాన్ జట్టును 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టిన అండర్-19 భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు. లక్ష్య ఛేదనలో రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనెర్లు యశస్వి జైస్వాల్(105 నాటౌట్), దివ్యాంశ్ సక్సేనా(59నాటౌట్)కు నా అభినందనలు’ అని తన సందేశంలో పేర్కొన్నారు. అండర్-19 క్రికెట్ జట్టు విజయంపై అభిమానుల నుంచి సామాజిక మాధ్యమాల్లో అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ప్రముఖ క్రీడాకారులు, నేతలు కూడా జట్టును అభినందిస్తున్నారు.

Go Back to Shorts
Under 19 cricket Team
Vice president
Venkaiah Naidu
greatings
Cricket
Under-19 World cup

More Telugu News