Machilipatnam: మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు

  • ఏపీలో మూడు ఓడరేవుల నిర్మాణానికి చర్యలు
  • పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ
  • కార్పొరేషన్ లో డైరెక్టర్లుగా సీఎస్, ఐదుగురు ఉన్నతాధికారులు
ఏపీలో మూడు ఓడరేవుల నిర్మాణం, అభివృద్ధి కోసం చర్యలు ప్రారంభించారు. మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణం కోసం ప్రత్యేకంగా పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక కార్పొరేషన్లలో బోర్డు డైరెక్టర్లుగా సీఎస్, మరో ఐదుగురు ఉన్నతాధికారులు ఉంటారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్లు ఏపీ మేరిటైమ్ బోర్డు పర్యవేక్షణలో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా పనిచేస్తాయి. ఒక్కో కార్పొరేషన్ కు పెట్టుబడి నిధి రూపంలో 50 వేల షేర్లు జారీచేసేందుకు అనుమతి ఇచ్చారు.
Machilipatnam
Bhavanapadu
Ramayapatnam
Andhra Pradesh
Port Development Corporation

More Telugu News