Chandrababu: తెనాలిలో బహిరంగ సభ.. చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు

  • అమరావతిని తరలించవద్దని డిమాండ్
  • స్థానిక వీఎస్ ఆర్ కళాశాల ప్రాంగణంలో సభ
  • ఈ సభకు హాజరుకానున్న జేఏసీ నేతలు, ఎమ్మెల్సీలు
రాజధాని అమరావతిని తరలించవద్దని రైతులు, అఖిలపక్ష నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించనున్న బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఈరోజు మధ్నాహ్నం మూడు గంటలకు నారాకోడూరు మీదుగా బయలుదేరిన చంద్రబాబు ర్యాలీ తెనాలిలోకి ప్రవేశించింది. చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబు వెంట అఖిలపక్ష జేఏసీ నేతలు ఉన్నారు. స్థానిక వీఎస్ ఆర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభలో జేఏసీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.  
Chandrababu
Telugudesam
Tenali
Meeting

More Telugu News