Talasani: సీఎం కేసీఆర్ ఆదేశాలతో చిరంజీవి, నాగార్జునలతో భేటీ అయిన మంత్రి తలసాని

  • టాలీవుడ్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ
  • అగ్రనటులతో మాట్లాడాలని తలసానికి ఆదేశం
  • చిరంజీవి నివాసానికి వెళ్లిన మంత్రి
తెలుగు సినిమా రంగం అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో మంత్రి తలసాని జూబ్లీహిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ చిరంజీవి, మరో అగ్రనటుడు నాగార్జునలతో ఆయన సమావేశమయ్యారు.

సినిమా రంగం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆయన చిరంజీవి, నాగార్జునలతో చర్చించారు. కాగా, తన నివాసానికి వచ్చిన మంత్రి తలసానికి చిరు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో మంత్రి తలసానితో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది.
Talasani
KCR
Chiranjeevi
Nagarjuna
Tollywood
Telangana

More Telugu News