Getup Srinu: 'జబర్దస్త్' వేరు .. సినిమా వేరు: గెటప్ శ్రీను

  • ఫ్రెండ్స్ తో కలిసి నటించడం ఆనందంగా వుంది 
  • 'త్రీ మంకీస్' అందరికీ నచ్చుతుంది 
  • తమ కెరియర్ కి హెల్ప్ అవుతుందన్న శ్రీను  
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్లలో గెటప్ శ్రీను ఒకరు. ఒక వైపున 'జబర్దస్త్' చేస్తూనే మరో వైపున సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో 'త్రీ మంకీస్' సినిమాలో ముగ్గురు కథానాయకులలో ఒకరుగా ఆయన చేశాడు. ఈ నెల 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "నా స్నేహితులైన సుధీర్ .. రామ్ ప్రసాద్ తో కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో నేను ఏ గెటప్ లోను కనిపించను .. నేను నాలానే వుంటాను. సినిమాల్లో అవసరమైతే తప్ప గెటప్పులలో కనిపించాలని అనుకోవడంలేదు. ఎందుకంటే 'జబర్దస్త్' వేరు .. సినిమా వేరు. అక్కడిలా ఇక్కడ కనిపించాలనుకోవడం కుదరదు. 'త్రీమంకీస్' అందరికీ నచ్చుతుందనీ, మా ముగ్గురి కెరియర్ కి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాము" అని చెప్పుకొచ్చాడు.
Getup Srinu
Sudigali Sudheer
Ram Prasad
Three Monkeys Movie

More Telugu News