Botsa Satyanarayana Satyanarayana: చంద్రబాబు తప్పుడు ప్రచారంచేస్తూ.. రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు: ఏపీ మంత్రి బొత్స

  • అర్హులైనవారందరికీ ఇంటివద్దనే పింఛన్లు అందుతున్నాయి
  • గత ప్రభుత్వంతో పోలిస్తే..ఎక్కువ మందికి పింఛన్లు ఇస్తున్నాము
  • కొత్తగా సుమారు 6లక్షల 10వేల మందికి ఫించన్లందించాము
అర్హులైన పేదలందరికి ఇంటివద్దకే పింఛన్లను అందించే విధానాన్ని తమ ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు బొత్స మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ పింఛన్లు ఇస్తున్నామన్నారు. అర్హులను గుర్తించడంలో పొరబాట్లేమైనా ఉంటే త్వరలోనే సరిదిద్ది వారికి కూడా పింఛన్లు ఇస్తామని మంత్రి తెలిపారు.

పింఛన్లపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనాలోచిత ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. తాము జన్మభూమి కమిటీలలా వసూలు దందాలు నడపలేదన్నారు. కొంతమంది పింఛనుదారులను తొలగించామని చంద్రబాబు ఆరోపణలు చేయడం అసంబద్ధమన్నారు. టీడీపీ నేతల మాటలను ప్రజలు నమ్మరన్నారు. పింఛన్ దారుల సంఖ్యను తగ్గించామని ఆ పార్టీ నేతలు ఆరోపించడాన్ని మంత్రి తీవ్రంగా ఆక్షేపించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారంచేస్తూ.. దాన్నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు.

గత ప్రభుత్వం 2019లో ఇచ్చిన పింఛన్ల కంటే తాము దాదాపుగా రెండు లక్షల మందికి ఎక్కువగా ఇస్తున్నామన్నారు. కొత్తగా సుమారు 6 లక్షల 10 వేల మందికి పింఛన్లు ఇస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని పింఛన్లు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. వీటి సంఖ్య సుమారు 40వేల వరకు ఉన్నాయన్నారు.
Botsa Satyanarayana Satyanarayana
Minister
Pensions
Scheme
Andhra Pradesh

More Telugu News