Arvind Kejriwal: హనుమాన్ భక్తుడినని చెప్పుకున్న కేజ్రీవాల్.. ఐతే హనుమాన్ చాలీసా పాడమన్న టీవీ యాంకర్.. వీడియో వైరల్

  • తాను మంచి సింగర్‌ను కాదన్న కేజ్రీవాల్
  • నవ్వుకున్న ప్రేక్షకులు
  • మంచినీళ్లు తాగిన కేజ్రీవాల్
  • చివరకు హనుమాన్ చాలీసా పాడి అందరినీ ఆశ్చర్యపరిచిన వైనం 
'నేను హనుమంతుడి భక్తుడిని' అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఎన్నికల ప్రచార సభలో చెప్పుకున్నారు. దీంతో ఓ టీవీ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొనగా జరిగిన ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆయనను ఇబ్బంది పెట్టేలా ఓ టీవీ యాంకర్ ఓ సవాలు విసరడమే ఇందుకు కారణం.

టీవీ చానెల్లో కొందరు అడిగిన ప్రశ్నలకు కేజ్రీవాల్ సమాధానాలు చెబుతున్నారు. ఆ సమయంలో టీవీ యాంకర్... 'మీరు హనుమాన్‌ భక్తుడినని చెప్పారు. హనుమాన్ చాలీసా పాడండి' అని అడిగారు. దీంతో కేజ్రీవాల్ 'నా గొంతు బాగుండదు' అని చెప్పారు. తన హృదయంలోనే ఈ చాలీసా ఉందని, తాను మంచి సింగర్‌ను కాదని అన్నారు. దీంతో ఆయనకు హనుమాన్ చాలీసా రాదేమోనన్న సందేహంతో అక్కడున్న వారంతా నవ్వారు.

వారి నవ్వును చూసిన కేజ్రీవాల్ మంచినీళ్లు తాగారు. గొంతు సవరించుకొని హనుమాన్ చాలీసా పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు.

Arvind Kejriwal
AAP
New Delhi

More Telugu News