Chandrababu: వైసీపీ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నాను: చంద్రబాబు నాయుడు

  • ప్రజా ప్రతినిధులు పాలన మీద దృష్టి పెట్టాలి
  • లేదంటే ప్రజల్లో ఆదరణ కోల్పోతారు 
  • వైసీపీని విమర్శిస్తూ ఓ యువకుడి వీడియోను పోస్ట్ చేసిన చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. 'ముఖ్యమంత్రి జగన్ మెప్పుకోసం భజన చేసే ప్రజా ప్రతినిధులు కాస్త పాలన మీద దృష్టి పెట్టాలని, లేదంటే ప్రజల్లో ఆదరణ కోల్పోతారని వైసీపీ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నాను. ఈ యువకుడి రాజకీయ, సామాజిక పరిజ్ఞానంలో కొంతయినా వైసీపీ ప్రభుత్వానికి ఉంటే బాగుండును అనిపిస్తోంది' అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.

'రాజధాని అన్న పదమే రాజ్యాంగంలో లేదని జగన్ అన్నారు. మరి మూడు రాజధానులు పెట్టాల్సిన అవసరం ఏముంది? అమరావతిని రాజధానిగా గతంలోనే ప్రకటించారు. మరి ఇప్పుడు కొత్తగా మూడు రాజధానుల ప్రకటన చేయడమేంటీ? అమరావతిలో టీడీపీ ప్రభుత్వం ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడితే విచారణ జరపాలి. విశాఖ పట్నంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరగలేదని సీబీఐ విచారణ కోరడానికి ఈ ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా?' అని ఆ వీడియోలో ఓ విద్యార్థి ప్రశ్నించాడు.
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News