Gottimukkla Padma Rao: ఇండస్ట్రీలో కొత్త ప్రొడ్యూసర్ ను ఒక అట ఆడుకుంటారు: నిర్మాత గొట్టిముక్కల పద్మారావు
- నిర్మాతగా నా తొలి సినిమా 'కంచు కవచం'
- కథలపై నాకు మంచి అవగాహన వుంది
- ఇక్కడ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ మాటే వింటారన్న పద్మారావు
తెలుగు చిత్రపరిశ్రమకి 'కంచు కవచం' సినిమా ద్వారా నిర్మాతగా గొట్టిముక్కల పద్మారావు పరిచయమయ్యారు. అలా కొన్ని సినిమాలను నిర్మించిన తరువాత ఆయన రాజకీయాల వైపు వెళ్లారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నిర్మాతగా తనకి ఎదురైన అనుభవాలను గురించి ప్రస్తావించారు.
"నేను పుట్టి పెరిగింది హైదరాబాదులో. నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతూ వుంటాను. అందువలన కథలపై మంచి అవగాహన వుంది. ఒక మిత్రుడి సలహా మేరకు 'కంచు కవచం' సినిమాతో నిర్మాతగా మారాను. ఈ సినిమాతోనే జయప్రకాశ్ రెడ్డిని .. తనికెళ్ల భరణిని పరిచయం చేశాను.
తొలి సినిమా నిర్మాణం సమయంలోనే ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. చిత్రపరిశ్రమలో ప్రతి ఒక్కరూ తామే గొప్ప అన్నట్టుగా ఫీలవుతుంటారు. తమ వల్లనే సినిమా ఆడుతుందని అంటారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయితే సైలెంట్ గా వుంటారు. కొత్త ప్రొడ్యూసర్ అయితే ప్రతి ఒక్కరూ ఒక ఆట ఆడుకుంటారు. చిత్రపరిశ్రమ ముందు బయటి రాజకీయాలు ఎందుకూ పనికిరావు" అని చెప్పుకొచ్చారు.