కర్ణాటక ప్రజలను ఇక ఆ దేవుడే కాపాడాలి: మాజీ సీఎం కుమారస్వామి
- రైతులు, విద్యార్థులకు బడ్జెట్లో ఒరిగిందేమీ లేదు
- రాష్ట్ర నిధుల్లో భారీగా కోతేశారు
- మంత్రివర్గ విస్తరణ వారికి సాహసంగా మారింది
బెళగావి వరద బాధితులకు రూ. 10 వేల చొప్పున ఇచ్చిన చెక్కులు డ్రా చేసుకోకుండా స్టే విధించడం దారుణమని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, యువతకు ఈ బడ్జెట్ నిరాశ మిగిల్చిందన్నారు. మంత్రి వర్గ విస్తరణపై మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వానికి మంత్రి వర్గ విస్తరణ ఓ సాహసంగా మారిందని కుమారస్వామి ఎద్దేవా చేశారు.