Pawan Kalyan: ఏపీ జీవో నెం.13 పై పవన్ కల్యాణ్ విమర్శలు

  • కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై స్పందన
  • ఎందుకు తరలిస్తున్నారో అర్థం కావడం లేదు
  • బలయ్యేది ఈ జీవోపై సంతకాలు చేసిన అధికారులే 
ఏపీ విజిలెన్స్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీస్ చైర్మన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ జీవో నెం.13 విడుదల చేయడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ‘ఇది చీకటి జీవో’, అని మండిపడ్డారు. ఈ జీవోపై సంతకాలు చేసిన అధికారులే బలవుతారని అన్నారు. విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాన్ని ఎందుకు తరలిస్తున్నారో అర్థం కావడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
Pawan Kalyan
Janasena
Andhra Pradesh
GO No.13

More Telugu News