TG Venkatesh: అమరావతి పెద్ద వివాదంగా మారింది: టీజీ వెంకటేశ్

  • అమరావతి పనికి రాదంటూనే మూడు రాజధానులా
  • అభివృద్ధి వికేంద్రీకరణ సబబే
  • మూడు ముక్కలుగా పాలన చేయొద్దు
ఏపీ రాజధాని అమరావతిని తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ మరోమారు విమర్శలు చేశారు. రాజధాని అమరావతి పెద్ద వివాదంగా మారిందని అన్నారు. రాజధానిగా అమరావతి పనికి రాదంటూనే మూడు రాజధానుల్లో ఒకటిగా దీనిని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ సబబుగానే ఉంది కానీ, మూడు ముక్కలుగా పాలన చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు. ఎక్కడైనా ఒకచోటే రాజధాని ఏర్పాటు చేయాలని, మూడు ప్రాంతాల్లో హైకోర్టు, అసెంబ్లీ, మినీ సచివాలయం ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.
TG Venkatesh
BJP
Amaravati
3 capitals

More Telugu News