Telugudesam: విశాఖపట్నంలో భూకుంభకోణానికి పాల్పడుతున్నారు: టీడీపీ నేత పట్టాభి తీవ్ర ఆరోపణలు

  • వైసీపీ 420 గ్యాంగ్‌కి  ఐదు వేల ఎకరాల భూమి కట్టబెడుతున్నారు
  • విశాఖపై వైసీపీ నేతలు కపట ప్రేమ చూపుతున్నారు
  • భూముల మీద ప్రేమతోనే రాజధాని మార్పు నిర్ణయం 
  • భూ కుంభకోణంపై జ్యుడీషియల్ విచారణ జరిపించగలరా? 
వైసీపీ 420 గ్యాంగ్‌కి విశాఖపట్నంలో ఐదు వేల ఎకరాల భూమి కట్టబెడుతున్నారని టీడీపీ నేత పట్టాభి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అమరావతిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖలో భూసమీకరణ చేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని ఆయన అన్నారు.

విశాఖపై వైసీపీ నేతలు కపట ప్రేమ చూపుతున్నారని, భూముల మీద ప్రేమతోనే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చాలని నిర్ణయం తీసుకుందని పట్టాభి ఆరోపించారు. విశాఖలో రాజధాని పేరిట వైసీపీ నేతలు
భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని అన్నారు. అమరావతి భూములతో పాటుగానే విశాఖపట్నంలోనూ భూకుంభకోణంపై ప్రత్యేక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేయాలన్నారు. భూ కుంభకోణంపై జ్యుడీషియల్ విచారణ జరిపించగలరా? అని సవాలు విసిరారు.
Telugudesam
YSRCP

More Telugu News