కరోనా కోసం సైంటిస్టులున్నారుగానీ.. జగరోనా వైరస్ కు చంద్రబాబే మందు తయారు చేస్తారు: విజయసాయికి బుద్ధా కౌంటర్
- చంద్రబాబుపై ట్విట్టర్ లో విజయసాయి సెటైర్
- దీటుగా బదులిచ్చిన బుద్ధా వెంకన్న
- తుపానులు ఆపే శక్తి వైఎస్ కుటుంబానికే ఉందని వ్యంగ్యం
అయినా, తుపానులను నియంత్రించగలిగే అతీంద్రియ శక్తులు ఉన్నది ఒక్క వైఎస్ కుటుంబానికేనని, ఈ విషయంలో సీఎం జగన్ తన బావ (బ్రదర్ అనిల్ కుమార్) సాయం తీసుకోవాలని సలహా ఇవ్వండి విజయసాయిగారూ అంటూ బుద్ధా వ్యంగ్యంగా అన్నారు. గతంలో ఆయనకు అనేక విపత్తులు ఆపిన అనుభవం ఉందంటూ బ్రదర్ అనిల్ కు సంబంధించిన ఓ వీడియోను కూడా బుద్ధా ట్వీట్ చేశారు.