Buddha Venkanna: కరోనా కోసం సైంటిస్టులున్నారుగానీ.. జగరోనా వైరస్ కు చంద్రబాబే మందు తయారు చేస్తారు: విజయసాయికి బుద్ధా కౌంటర్

  • చంద్రబాబుపై ట్విట్టర్ లో విజయసాయి సెటైర్
  • దీటుగా బదులిచ్చిన బుద్ధా వెంకన్న
  • తుపానులు ఆపే శక్తి వైఎస్ కుటుంబానికే ఉందని వ్యంగ్యం
చంద్రబాబుకు తుపానులను నియంత్రించే అతీంద్రియ శక్తులు ఉన్నాయని, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కు కూడా ఆయనే మందు కనిపెట్టాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న దీటుగా బదులిచ్చారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు, మందు తయారుచేసేందుకు శాస్త్రవేత్తలు ఉన్నారని, కానీ గత ఎనిమిది నెలలుగా ఏపీ ప్రజలను పట్టిపీడిస్తున్న జగరోనా వైరస్ కు మాత్రం కచ్చితంగా చంద్రబాబే మందు తయారుచేస్తారని వ్యాఖ్యానించారు.

అయినా, తుపానులను నియంత్రించగలిగే అతీంద్రియ శక్తులు ఉన్నది ఒక్క వైఎస్ కుటుంబానికేనని, ఈ విషయంలో సీఎం జగన్ తన బావ (బ్రదర్ అనిల్ కుమార్) సాయం తీసుకోవాలని సలహా ఇవ్వండి విజయసాయిగారూ అంటూ బుద్ధా వ్యంగ్యంగా అన్నారు. గతంలో ఆయనకు అనేక విపత్తులు ఆపిన అనుభవం ఉందంటూ బ్రదర్ అనిల్ కు సంబంధించిన ఓ వీడియోను కూడా బుద్ధా ట్వీట్ చేశారు.
Buddha Venkanna
Vijay Sai Reddy
Corona Virus
Chandrababu
JagaronaVirus

More Telugu News