Nara Lokesh: జగన్ గారూ! పండుటాకులకు పెన్షన్ తీసేసిన పాపం ఊరికేపోదు: నారా లోకేశ్

  • ఒక్క అవకాశం ఇస్తే.. ఎన్ని కష్టాలో, నష్టాలో!
  • చివరకు అవ్వా, తాతలనూ వదలలేదు
  • ఓ ట్వీట్ తో పాటు వీడియో పోస్ట్ చేసిన లోకేశ్
సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేశారు. ‘ఒక్క అవకాశం ఇస్తే.. ఎన్ని కష్టాలో, నష్టాలో, అనర్థాలో..’ అంటూ ధ్వజమెత్తారు. చివరకు అవ్వా, తాతలను కూడా వదలలేదని, పండు టాకులకు పెన్షన్ తీసేసిన పాపం ఊరికే పోదంటూ జగన్ పై మండిపడుతూ లోకేశ్ ఓ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ తో పాటు ఓ వీడియోను కూడా జతపరిచారు. పెన్షనే తనకు ఆధారం అని, అది లేకుండా చేశారంటూ ఓ వృద్ధురాలు తన ఆవేదన వ్యక్తం చేయడం ఈ వీడియోలో కనబడుతుంది.
Nara Lokesh
Telugudesam
Jagan
cm

More Telugu News