Amaravati: రాజధానిపై బీజేపీ అవసరమైనప్పుడు స్పందిస్తుంది : మాజీ మంత్రి కామినేని

  • రైతుల దీక్షకు మద్దతు తెలిపిన బీజేపీ నేత
  • సమస్యను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానని వెల్లడి
  • తరలింపును ఆపే శక్తి బీజేపీకి ఉంది
రాజధాని అమరావతి అంశంపై నెలకొన్న ప్రతిష్ఠంభన విషయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు సమయం వచ్చినప్పుడు సరిగానే స్పందిస్తారని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్‌ అన్నారు. అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులను ఈరోజు కలిసి ఆయన సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సమస్యను కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. రాజధాని తరలిస్తే ఇప్పటికే నిర్మించిన భవనాలు ఏం చేస్తారని ప్రశ్నించారు. రాజధాని తరలిపోకుండా బీజేపీ ఆపగలదన్నారు. రాజధాని విషయంలో బీజేపీ, జనసేన సంయుక్త కార్యాచరణ ఇప్పటికే ప్రకటించాయని, ఉద్యమం త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు.
Amaravati
Kamineni Srinivas
farmers

More Telugu News