New Delhi: ఢిల్లీ పీఠం మళ్లీ కేజ్రీవాల్‌కే.. పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడి!

  • మోదీ ఆకర్షణ, అమిత్ షా వ్యూహాలు పనిచేయవు
  • కేజ్రీవాల్ సంక్షేమ పథకాలపై ప్రజల సంతృప్తి
  • కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం ఆప్‌కు టర్న్ అయింది
ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయ దుందుభి మోగిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. ఢిల్లీలో ఎన్నికల్లో మోదీ ఆకర్షణ, అమిత్ షా వ్యూహాలు ఎంతమాత్రమూ పనిచేయబోవని హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ సర్వే తేల్చి చెప్పింది. కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఢిల్లీలోని పేదలు, మధ్య తరగతి ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, సగటున ఒక్కో కుటుంబం నెలకు రూ.1500 నుంచి  రూ.3000 వేలకు ఆదా చేయగలుగుతోందని పేర్కొంది.  

ఢిల్లీలో విశ్వసనీయత గల నేత లేకపోవడం కూడా బీజేపీకి నష్టం చేసే అంశాల్లో ఒకటని సర్వే తెలిపింది. షీలాదీక్షిత్ మరణంతో కాంగ్రెస్ కోలుకోలేకపోతోందని, ఎన్నార్సీ, సీఏఏలు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా ఆప్‌కు మారిందని సర్వే స్పష్టం చేసింది.
New Delhi
Arvind Kejriwal
BJP
Congress
AAP

More Telugu News