Budget 2020: తెలంగాణ బడ్జెట్‌కు వేళాయే...ఈనెల మూడో వారంలోనే!
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది.. రాష్ట్రానికి వచ్చేవి ఏమిటో, రానివి ఏమిటో తేలిపోయింది. దీంతో తమ రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనకు తెలంగాణ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కార్యాచరణ మొదలయ్యిందని, ఈ నెల మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయని భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసినా సహకార ఎన్నికలు ఉండడం, ప్రస్తుతం మేడారం జాతర జరుగుతుండడంతో మూడో వారం నాటికి అన్నీ పూర్తవుతాయి. ఆ సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అందరికీ అనుకూలంగా ఉంటుందని కేసీఆర్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.