Ram Gopal Varma: రేపిస్ట్ చెన్నకేశవులు భార్యను కలిశా: రామ్ గోపాల్ వర్మ

  • 16 ఏళ్ల వయసులోనే రేణుక పెళ్లి చేసుకుంది
  • 17 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనివ్వబోతోంది
  • సొంత భార్యకు కూడా చెన్నకేశవులు అన్యాయం చేశాడు
దిశపై హత్యాచారం జరిపి, పోలీసుల ఎన్ కౌంటర్లో మృతి చెందిన వారిలో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుకను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలిశారు. ఈ విషయాన్ని వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'రేపిస్ట్ చెన్నకేశవులు భార్యను కలిశా. 16 ఏళ్ల వయసులోనే అతన్ని రేణుక పెళ్లి చేసుకుంది. 17 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనివ్వబోతోంది. దిశకే కాకుండా తన సొంత భార్యకు కూడా చెన్నకేశవులు తీరని అన్యాయం చేశాడు. మరో చిన్నారికి జన్మనివ్వబోతున్న చిన్నారి రేణుక.. వీరిద్దరి భవిష్యత్తు అంధకారమే' అని వర్మ ట్వీట్ చేశారు. మరోవైపు దిశ కథాంశంతో వర్మ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.
Ram Gopal Varma
RGV
Tollywood
Rapist Chennakesavulu
Wife
Renuka
Disha

More Telugu News