Sonia Gandhi: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

  • అస్వస్థతకు గురైన సోనియా
  • జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి
  • వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఆసుపత్రి సిబ్బంది
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. సోనియా కొన్నిరోజులుగా జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోనియా అస్వస్థతకు గురవడంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో సోనియాకు సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్నిరోజులుగా ఆమె ఆరోగ్యం నిలకడగా లేదని, వైద్య పరీక్షల కోసమే సోనియా ఆసుపత్రికి వెళ్లినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సోనియా గంగారామ్ ఆసుపత్రిలో చేరారన్న సమాచారంతో కాంగ్రెస్ నేతలు తరలివెళుతున్నారు.
Sonia Gandhi
Illness
Congress
New Delhi
Sir Gangaram Hospital

More Telugu News