Asaduddin Owaisi: గాంధీ, అంబేద్కర్ ల భావజాలం ఉన్నవాడే ‘భారతీయుడు’: అసదుద్దీన్ ఒవైసీ

  • రామభక్తి భావజాలం ఉన్నవాడు భారతీయుడు కాదు
  • సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్ ఆర్పీలకు ప్రజలు వ్యతిరేకం
  • ఈ చట్టాలపై సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం
తన దృష్టిలో ‘భారతీయుడు’ అంటే ఎవరిని అంటారో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. రామభక్తి భావజాలం ఉన్నవాడు భారతీయుడు కాదని, మహాత్మా గాంధీ, డాక్టర్. బీఆర్ అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తుల భావజాలం ఎవరికైతే వుంటుందో వాడే ‘భారతీయుడు’ అని అభిప్రాయపడ్డారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్ ఆర్పీ)లను దేశ వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ మూడింటికి వ్యతిరేకంగా తాము ఆందోళనలు నిర్వహించామని, ఈ చట్టాలపై సుప్రీంకోర్టులో పోరాడుతున్నామని చెప్పారు.




Asaduddin Owaisi
MIM
CAA
NRC
NRP

More Telugu News