Amaravati: అమరావతి పరిరక్షణ సమితి పలు తీర్మానాలు!

  • రైతు సంఘాల నాయకులతో పరిరక్షణ సమితి చర్చ
  • రైతులు, మహిళలకు అండగా ఉండాలి
  • రాజధానిగా అమరావతిని కొనసాగించాలని తీర్మానం
రైతు సంఘాల నాయకులతో అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించిన చర్చా కార్యక్రమం ముగిసింది. వివిధ జిల్లాల రైతు సంఘాల నాయకులు, జేఏసీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసింది. రైతులు, మహిళలకు అండగా ఉండాలని, రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, రైతులకు ఎలాంటి అన్యాయం జరగకూడదని, అమరావతిలోని ప్రస్తుత భవనాల నిర్మాణాలను పూర్తి చేసి పాలన ఇక్కడి నుంచే సాగించాలని, అన్ని జిల్లాల అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించాలని, అమరావతి రైతులకు మద్దతుగా జిల్లాల నుంచి బస్సు యాత్ర చేయాలని, ఏడాది కార్యక్రమాలపై దీర్ఘ కాలిక ప్రణాళిక రూపొందించాలని మొదలైన తీర్మానాలు చేసింది.
Amaravati
Amaravai parirakshna samiti
JAC

More Telugu News