Tulluru: తుళ్లూరులో రైతుల మహాధర్నాకు హాజరైన సీనియర్ నటుడు శివకృష్ణ

  • తుళ్లూరులో రైతుల దీక్ష
  • రైతుల పోరాటానికి మద్దతు పలికిన శివకృష్ణ
  • తాను వచ్చింది రాజకీయాల కోసం కాదని వెల్లడి
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, మూడు రాజధానులు వద్దని కోరుతూ రైతులు కొన్నినెలలుగా దీక్ష కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఈ మేరకు దీక్షా శిబిరాలు వెలిశాయి. తాజాగా, తుళ్లూరు రైతులు నిర్వహిస్తున్న మహాధర్నాకు టాలీవుడ్ సీనియర్ నటుడు శివకృష్ణ హాజరయ్యారు. రాజధాని రైతుల పోరాటానికి శివకృష్ణ సంఘీభావం తెలిపారు.

రాజధాని కోసం రైతులు నిస్వార్థంగా వేలాది ఎకరాల భూములు ఇచ్చారని, నమ్మి భూములు ఇచ్చిన రైతులను వేధించడం సరికాదని హితవు పలికారు. రైతులు కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదని శివకృష్ణ పేర్కొన్నారు. తాను వచ్చింది ఓ పార్టీ తరఫునో, రాజకీయాల కోసమో కాదని, రైతులకు బాసటగా నిలిచేందుకే వచ్చానని స్పష్టం చేశారు.
Tulluru
Farmers
Mahadharna
Sivakrishna
Tollywood
Amaravati

More Telugu News