Allu Arjun: సినిమా కోసమే అలా చేశాను... దయచేసి ఎవరూ నన్ను ఫాలో కావద్దు: అల్లు అర్జున్

  • బ్లాక్ బస్టర్ హిట్టయిన అల.. వైకుంఠపురములో
  • వరుస సక్సెస్ మీట్లతో చిత్రబృందం హుషారు
  • సిత్తరాల సిరపడు పాటలో పొగతాగుతూ కనిపించిన బన్నీ
  • రియల్ లైఫ్ లో తాను సిగరెట్లకు దూరమని వెల్లడి
అల.. వైకుంఠపురములో చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిపోవడమే కాదు, బాక్సాఫీసు వద్ద రికార్డులు నమోదు చేసింది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ఈ సినిమా ప్రభంజనం సృష్టించడంతో చిత్రబృందం వరుసగా సక్సెస్ మీట్ లు నిర్వహిస్తూ హుషారెత్తిస్తోంది. తాజాగా ఓ సక్సెస్ మీట్ లో హీరో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తమను కూడా విజయోత్సవాల్లో భాగం చేయాలని డిస్ట్రిబ్యూటర్లు ఎప్పటినించో అడుగుతున్నారని, వాళ్ల కోసం తప్పకుండా ఓ ఫంక్షన్ నిర్వహిస్తానని అప్పట్లో మాటిచ్చానని తెలిపారు. ఇప్పుడు అల... వైకుంఠపురములో చిత్రం అదిరిపోయే హిట్ కావడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అయితే, తాను ఈ సినిమాలో 'సిత్తరాల సిరపడు' పాటలో పొగ తాగుతూ కనిపిస్తానని, కానీ అది సినిమా కోసం చేసిందని, దయచేసి అభిమానులెవరూ తనను ఫాలో కావొద్దని హితవు పలికారు. రియల్ లైఫ్ లో తాను సిగరెట్లకు చాలా దూరంగా ఉంటానని తెలిపారు.
Allu Arjun
Ala Vaikunthapuramulo
Block Buster
Success Meet

More Telugu News