'దిశ'ను అత్యాచారం చేసి చంపిన 'చెన్నకేశవులు' భార్యతో రామ్ గోపాల్ వర్మ భేటీ.. కీలక వ్యాఖ్యలు
- ఈమె రేపిస్ట్ చెన్నకేశవులు భార్య
- 16 ఏళ్ల వయసులో ఆమెను చెన్నకేశవులు పెళ్లి చేసుకున్నాడు
- అతడి బిడ్డకు ఆమె 17 ఏళ్ల వయసులో జన్మనిచ్చింది
- దిశ జీవితాన్నే కాదు అతడు తన భార్యను కూడా బాధితురాలిగా చేశాడు
ఆమెతో భేటీ అయిన విషయాన్ని వర్మ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. 'ఇప్పుడే ఆమెను కలిశాను. ఆమె రేపిస్ట్ చెన్నకేశవులు భార్య. 16 ఏళ్ల వయసులో ఆమెను చెన్నకేశవులు పెళ్లి చేసుకున్నాడు. అతడి బిడ్డకు ఆమె 17 ఏళ్ల వయసులో జన్మనివ్వనుంది. దిశ జీవితాన్నే కాదు అతడు తన భార్యను కూడా బాధితురాలిగా చేశాడు. ఒక చిన్నారి అయ్యుండి ఆమె మరో చిన్నారికి జన్మనిస్తుంది. వారిద్దరికీ మంచి భవిష్యత్తు లేదు' అని రామ్ గోపాల్ వర్మ తెలిపాడు.
కాగా, దిశ అత్యాచారం, హత్య ఘటనల ఆధారంగా సినిమా చేయబోతున్నానని వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాకు 'దిశ' అనే టైటిల్ను పెట్టారు. నిర్భయ ఘటన తర్వాత కొత్తగా దోషులు ఏం నేర్చుకుంటున్నారో 'దిశ' చిత్రంలో భయంకరమైన గుణపాఠంగా తెలపబోతున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చెన్నకేశవులు భార్యను వర్మ తన ఆఫీసులో కలిసినట్లు తెలుస్తోంది.