YSRCP: చంద్రబాబు స్వగ్రామంలో ఈ రోజు సభ నిర్వహించి తీరుతామంటోన్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి

  • అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం
  • జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని నారావారిపల్లె నుంచే తెలియజేస్తాం
  • అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే మా ఉద్దేశం
ఆంధ్రప్రదేశ్‌లో వికేంద్రీకరణకు మద్దతుగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజక వర్గంలోని టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో వైసీపీ సభ నిర్వహిస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సభను నిర్వహించి తీరుతామని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని చెప్పారు. జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని నారావారిపల్లె నుంచే తెలియజేస్తామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే తాము అధికార వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని చెవిరెడ్డి అన్నారు. ఈ సభ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలియజేస్తామని స్పష్టం చేశారు. కాగా, ఈ సభకు ఏపీ మంత్రులతో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
YSRCP
Telugudesam
Chevireddy Bhaskar Reddy

More Telugu News