YSRCP: '3 రాజధానులకు మద్దతు'గా చంద్రబాబు స్వగ్రామంలో వైసీపీ మంత్రుల సభ.. ఉద్రిక్తత

  • సభ ఏర్పాటుపై టీడీపీ నేతల ఆగ్రహం
  • రైతుల పోరాటానికి మద్దతుగా టీడీపీ నేతల నిరసన
  • వైసీపీ సభ, టీడీపీ నిరసన కార్యక్రమాలతో ఉద్రిక్త వాతావరణం
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజక వర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ రోజు మధ్యాహ్నం సభ నిర్వహించాలని వైసీపీ ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ సభను ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో నారావారిపల్లెలో నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని, దాని వల్ల రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను వైసీపీ నేతలు వివరించి చెప్పనున్నారు.

 అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామంలో సభ ఏర్పాటుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం ప్రారంభించారు. వైసీపీ సభ, టీడీపీ నిరసన కార్యక్రమాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు భద్రత పెంచారు.
YSRCP
Telugudesam
Amaravati
Chittoor District

More Telugu News